add

Thursday, 19 February 2015

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 : సినీ నటుడు చంద్రమోహన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్య బృందం తెలిపింది. చంద్రమోహన్‌కు బుధవారం గుండెపోటుతో రావడంతో ఆయన మేనల్లుడు కృష్ణమోహన్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. హృదోగ నిపుణుడు డాక్టర్‌ మనోజ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. చంద్రమోహన్‌ స్పృహలోనే ఉన్నారని, కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత డిశ్చార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

No comments:

Post a Comment