దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన చిత్రం 'రోబో'. హిందీ, తమిళం, తెలుగు అంటూ పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా పెళ్లి, పిల్లలూ అంటూ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఐశ్వర్య ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ అయిన విషయం తెలిసిందే. తన సెకండ్ ఇన్నింగ్సును ఐశ్వర్యారాయ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటోంది. ఓపక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క సౌత్ సినిమాలు కూడా చేయాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో మళ్లీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో జతకట్టబోతుందని సమాచారం. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న 'రోబో 2' చిత్రంలో ఐశ్వర్య నటించనుందట. ఈ చిత్రం ద్వారా దక్షిణాదిలో మళ్లీ క్రేజ్ సంపాదించుకునేందుకు ఐష్ ప్లాన్ చేస్తోంది.

No comments:
Post a Comment