add

Wednesday, 4 March 2015

ఒకే సినిమాలో 24 పాత్రలా
హాలీవుడ్ సినిమా ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించడానికి సిధ్ధం అవుతున్నాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ నటుడు చేయనన్ని క్యారెక్టర్లు డికాప్రియో చేస్తున్నాడు. ఈ టైటానిక్ హీరో చేయబోతున్న క్రౌడెడ్ రూం అనే సినిమాలో 24 క్యారెక్టర్లలో కనిపించబోతున్నాడట.అతనిలోని నటనకు ఇది ఓ పరీక్ష అని సినీ విమర్శకులంటున్నారు. 1981లో వచ్చిన బిల్లీ మిల్లీగన్ నవల ఆధారంగా క్రౌడెడ్ రూమ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.అప్పట్లో ఎన్నార్ నవరాత్రి సినిమాలో 9 క్యారెక్టర్లు చేసి టాలీవుడ్ లోనే కొత్త చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత కమలహాసన్ దశవతారం సినిమాలో 10 పాత్రలు వేసి అందరినీ మిస్మరైజ్ చేశాడు. ఇప్పటివరకు వీళ్లు చేసిందే గొప్పగా ఫీలవుతున్నాం. ఇప్పుడు డికాప్రియో ఇలాంటి రికార్దులన్ని బద్దలు కొట్టబోతున్నాడు.

No comments:

Post a Comment