add

Wednesday, 4 March 2015



                           బాహుబలి’ షాకింగ్‌ న్యూస్‌






టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘బాహుబలి’. ప్రభాస్‌ ద్వి పాత్రాభినయంలో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్లుగా దాదాపు సంవత్సరం క్రితం దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అనుకున్న టైంకు విడుదల చేయలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్‌ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘బాహుబలి’ టీం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. నిర్మాణానంతర కార్యక్రమాలు లేట్‌ అవుతూ ఉండటం వల్ల ఈ సినిమాను నెల ఆలస్యంగా మేలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పనప్పటికి మే 15కు ఈ సినిమా వాయిదా వేశారని తేలిపోయింది. ఈ సినిమాను రాజమౌళి దాదాపు రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ మేలో విడుదల కానుండగా, రెండవ పార్ట్‌ వచ్చే సంవత్సరం ప్రధమార్థంలో విడులకు చేయనున్నారు.

No comments:

Post a Comment