add

Friday, 6 March 2015

    లయన్ డైలాగ్స్ ని లీక్ చేసిన బాలయ్య




నటసింహం నందమూరి బాలయ్య త్వరలో లయన్ గా రాబోతున్న విషయం మనకు తెలిసినదే…ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి. లీక్ చేసింది ఎవరో కాదు స్వయంగా బాలకృష్ణనే.
అనంతర పురం జిల్లా పర్యటనలో ఉన్న బాలయ్య అక్కడ అభిమానుల కోరిక మేరకు లయన్ లోని రెండు డైలాగులు వదిలారు.. అవి ఇవే.. నాకు పుట్టుకతోనే భగవంతుడు ప్రతీ పార్ట్ లో ఓ పవర్ దాచాడు. పొరపాటున ఒక్క పార్ట్ టచ్ చేసినా.. ఇక అంతే.. అవుట్ ! ‘నన్ను పడుకోబెట్టాలంటే.. ఎప్పుడో పడుకున్న నీ తాతలు తిరిగొచ్చినా ఏం పీకలేర్రా’.. వామ్మో.. డైలాగులు అదిరిపోలేదూ..! పార్టుల్లో పవరేమో గానీ, బాలయ్య మాటల్లో మాత్రం కావల్సినంత ఉంది.
థియేటర్లో ఈ డైలాగులు ఎలా పేలతాయో గానీ, ఈ సినిమా బయటకు వచ్చేలోగా ఈ డైలాగులపై బోలెడన్ని పేరడీలు పుట్టేయడం ఖాయం. సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్.

No comments:

Post a Comment